తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతంగా ఉన్న ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో కరోనా బాధితులకు హోం క్వారంటైన్ కేంద్రం ఏర్పాటు చేయాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. మధిరలోని ఆయన క్యాంపు కార్యాలయంలో ఆయన సమావేశం ఏర్పాటు చేశారు. కొవిడ్ పాజిటివ్ ఉన్న వాళ్లు ఇళ్లలో ఉండటం వల్ల వారి కుటుంబ సభ్యులకూ మహమ్మారి సోకే ప్రమాదం ఉందని.. కాబట్టి అలాంటి వారందర్నీ పట్టణంలోని ఒక ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేసి వసతులు కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
మధిరలో హోం క్వారంటైన్ కేంద్రం ఏర్పాటు చేయాలి: భట్టి
ఖమ్మం జిల్లా మధిరలో కరోనా బాధితుల కోసం ప్రత్యేకంగా హోమ్ క్వారంటైన్ కేంద్రం ఏర్పాటు చేయాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. ఈ విషయం తాను జిల్లా కలెక్టర్, వైద్యశాఖాధికారికి విన్నవించినట్టు ఆయన క్యాంపు కార్యాలయం ద్వారా వెల్లడించారు.
మధిరలో హోం క్వారంటైన్ కేంద్రం ఏర్పాటు చేయాలి: భట్టి
ఇప్పటికే ఈ విషయమై కలెక్టర్, జిల్లా వైద్య శాఖ అధికారికి విన్నవించినట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కరోనా కట్టడికై నియోజకవర్గంలో ప్రతి పల్లె, పట్టణంలోని వీధుల్లన్నింటిలో హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారి చేస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చూడండి :భాజపా రాష్ట్ర కమిటీని ప్రకటించిన బండి సంజయ్