ప్రభుత్వ విధానాలతో రాష్ట్రంలోని మూడున్నర లక్షల మంది ఉద్యోగుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందని, ఉద్యోగులను కాందీశీకులుగా మార్చే 317 జీవోను తక్షణమే రద్దు చేయాలని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఖమ్మంలో ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానికత అంశాన్ని కాదని సీనియారిటీ ఆధారంగా పోస్టింగ్‌లు కేటాయించడం హేతుబద్ధంగా లేదన్నారు. స్పౌస్ కేసులనూ పక్కనపెట్టి బదిలీలు జరపడంతో గందరగోళ పరిస్థితి నెలకొందని ఆయన పేర్కొన్నారు. కరోనా మూడో ఉద్ధృతి వస్తుందనే సంకేతాల నేపథ్యంలో వైద్యారోగ్య శాఖ ఉద్యోగులను దూరప్రాంత జిల్లాలకు బదిలీ చేస్తే ఎలాగని భట్టి ప్రశ్నించారు.
Batti on 317 GO : 317 జీవోను వెంటనే రద్దు చేయాలి - ఖమ్మం వార్తలు
Batti on 317 GO : రాష్ట్రంలో ఉద్యోగుల బదిలి గందరగోళానికి దారితీసిందని సీఎల్పీనేత భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో ఉద్యోగ సంఘం నాయకులు ఆయనను కలిశారు. ఈసందర్భంగా 317 జీవోను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
Batti Vikramarka