తెలంగాణ

telangana

ETV Bharat / state

Suspicious Pigeon in Telangana: ఖమ్మం జిల్లాలో చైనా ట్యాగ్​తో పావురం కలకలం - తెలంగాణలో పావురం కలకలం

Suspicious Pigeon in Telangana : దేశంలో చైనా భాషలో ఉన్న ట్యాగ్​తో కూడిన పావురాలు కనిపించడం కలకలం రేపుతున్నారు. ఇటీవలే ఒడిషా, ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రాల్లో ఈ కపోతాలు ఆందోళన రేకెత్తించాయి. బుధవారం రోజున తెలంగాణలోనూ ఈ పావురాలు కనిపించాయి. ఖమ్మం జిల్లా దమ్మాయిగూడెంలో కనిపించిన ఈ కపోతాన్ని స్థానిక రైతులు పోలీసులకు అందించగా.. పోలీసులు అటవీ శాఖ అధికారులకు అప్పజెప్పారు.

Suspicious Pigeon in Telangana
Suspicious Pigeon in Telangana

By

Published : Jan 6, 2022, 7:12 AM IST

Suspicious Pigeon in Telangana : ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం దమ్మాయిగూడెంలో బుధవారం కాలుకు చైనా భాష ట్యాగ్‌ ఉన్న పావురం కనిపించింది. ఇది స్థానికంగా కలకలం రేపింది. గ్రామ సమీపంలోని కల్లంలో రైతులు వరి ధాన్యం ఆరబోశారు. ఆ సమయంలో కపోతం రాగా.. దాని కాలుకు చైనా భాషలో ముద్రించిన ఓ ట్యాగ్‌ ఉన్నట్లు రైతులు గుర్తించారు.

Suspicious Pigeon Captured in Telangana : వెంటనే పోలీసులు, అధికారులకు సమాచారమిచ్చారు. అనంతరం అక్కడికి చేరుకున్న ఎస్సై భవానీ దాన్ని పరిశీలించి అటవీ శాఖ డివిజనల్‌ అధికారి సురేశ్‌కు అప్పగించారు. పావురానికి చికిత్స అందించి పూర్తి వివరాలను వెల్లడిస్తామని అటవీ శాఖ అధికారులు తెలిపారని ఎస్సై చెప్పారు. ఒడిశా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోనూ సోమ, మంగళవారం చైనా భాష ట్యాగ్‌తో ఉన్న కపోతాలు కనిపించడం గమనార్హం.

Suspicious Pigeon: ఇటీవల ఒడిశా సుందర్​గఢ్​ రాజ్​గంగ్​పుర్​ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాంస్​​బహాల్ గ్రామంలో అనుమానాస్పద పావురం కన్పించింది. దాని కాలుకు చైనీస్​ ట్యాగ్ ఉండంటంతో అధికారులు హూటాహుటిన రంగంలోకి దిగారు. అది ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు పంపి ఉంటారు? అనే విషయాలు తెలుసుకునే పనిలో నిమగ్నమయ్యారు.

Tagged Pigeon Identified in Chimakurthy: ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా చీమకుర్తిలో ట్యాగ్ వేసిన పావురం కనిపించింది. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ.. కుడి కాలికి పసుపు రంగు ట్యాగు వేసిన పావురం.. ఓ బహుళ అంతస్థుల భవనంలో సంచరిస్తూ కనిపించింది. తెలుపు రంగు రెక్కలు, లేత బూడిదరంగు వర్ణంలో ఉన్న పావురానికి ట్యాగ్ వేసి ఉంది. ఆ ట్యాగ్ పై ఎగురుతున్న పక్షి బొమ్మ, 'ఏఐఆర్' అని ఆంగ్ల అక్షరాలతోపాటుగా 2019 2201అనే అంకెలు ఉన్నాయి. గమనించిన అపార్టుమెంట్ వాసులు.. దానిని పట్టుకుని వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

ABOUT THE AUTHOR

...view details