తెలంగాణ

telangana

ETV Bharat / state

చేపల పెంపకంలో శిక్షణ... రాయితీ రుణాలు

వ్యవసాయంతో పాటు రైతులు చేపల పెంపకం చేపట్టేలా అవగాహన కల్పిస్తున్నారు. పాలేరులోని పీవీ నరసింహారావు తెలంగాణ పశు వైద్య విశ్వవిద్యాలయంలో శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.

By

Published : May 29, 2019, 10:42 AM IST

చేపల పెంపకంలో శిక్షణ... రాయితీ రుణాలు

ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు పీవీ నరసింహారావు తెలంగాణ పశు వైద్య విశ్వవిద్యాలయంలో చేపల పెంపకంపై శిక్షణ ఇస్తున్నారు. జాతీయ మత్స్య అభివృద్ధి మండలి, వ్యవసాయ విస్తరణ నిర్వహణ జాతీయ సంస్థ సహాయంతో... ఆక్వా క్లినిక్, ఆక్వా ది సిరీస్ అభివృద్ధి అను అంశంపై 30రోజులపాటు నైపుణ్య శిక్షణ, సర్టిఫికేట్ కోర్సులు నిర్వహిస్తున్నారు. 9 రాష్ట్రాలకు చెందిన మత్స్య పరిశోధన రైతులు, శాస్త్రవేత్తలు, పరిశోధన సంస్థలు, అధికారులు పాల్గొన్నారు.

ఆక్వా క్లినిక్​ సర్టిఫికేట్​తో... చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలు, చేపల ఎరువుల దుకాణాల ఏర్పాటుకు 50 శాతం రాయితీతో రుణాలు మంజూరు చేస్తారని అధికారులు తెలిపారు. చేపల పెంపకంలో లాభాల కంటే నష్టాలే ఎక్కువగా వస్తాయని, చేపలకు వచ్చే వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనువైన ప్రదేశాలు ఎంపిక చేసుకొని, మట్టి, నీటి పరీక్షలు చేసి చేపల పెంపకం చేపట్టాలన్నారు. చేపపిల్లల ఉత్పత్తి తర్వాత ఎగుమతి, దిగుమతిపై సలహాలు సూచనలు ఇచ్చారు.

చేపల పెంపకంలో శిక్షణ... రాయితీ రుణాలు

ఇవీ చూడండి: రాక్షసబల్లులు చూడాలనుకుంటే.. వెంటనే ఇక్కడికి రండి

ABOUT THE AUTHOR

...view details