తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఐదేళ్లలో జిల్లాను రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలుపుతారు' - minister puvvada ajay kumar latest updates

తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా పువ్వాడ అజయ్ కుమార్ బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తైన సందర్భంగా ఖమ్మంలో తెరాస శ్రేణులు వేడుకలు నిర్వహించారు. జిల్లా నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు.

celebrations in khammam as puvvada ajay completes one year as telangana transport minister
మంత్రిగా ఏడాది పూర్తి చేసుకున్న పువ్వాడ అజయ్

By

Published : Sep 8, 2020, 1:09 PM IST

తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా పువ్వాడ అజయ్ కుమార్ బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తైనందున ఖమ్మంలో తెరాస శ్రేణులు సంబురాలు చేసుకున్నారు. జిల్లా ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. జిల్లా పార్టీ కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. మంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

జిల్లాలో ఏడాది కాలంలోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన మంత్రి పువ్వాడ.. తన పదవి కాలంలో జిల్లాను రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలుపుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ ఛైర్మన్ లింగాల కమల్ రాజు, డీసీసీబీ ఛైర్మన్ కురాకుల నాగభూషణం, పార్టీ ఇంఛార్జి ఆర్జేసీ కృష్ణ పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details