Haystack CC Camera: మూడేళ్లుగా గడ్డివాము తగులపెడుతూ తప్పించుకొని తిరుగుతున్న ఓ దుండగుడు సీసీ కెమెరా సహాయంతో పట్టుబడ్డాడు. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం బొక్కల తండాలో మిస్టరీగా మారిన గడ్డివాము దగ్ధం చిక్కుముడి వీడింది. బాబులాల్‌కు చెందిన గడ్డి వాము మూడేళ్లలో ఐదుసార్లు కాలిపోవడంతో ఆవేదన చెందాడు. ప్రతిసారి ఎందుకిలా జరుగుతుందో తెలియక ఆందోళన వ్యక్తం చేసేవాడు. గడ్డివాము తగులబెడుతున్న వ్యక్తిని ఎలాగైనా పట్టుకోవాలని ఇంటి చుట్టూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాడు.
Haystack CC Camera: గడ్డివాము నిందితుడిని పట్టించిన సీసీకెమెరా - CCTV camera capturing the haystack accused
Haystack CC Camera: మూడేళ్లుగా గడ్డివాము తగులపెడుతున్నాడో ప్రబుద్ధుడు. ఇది తెలియని యజమాని ఎందుకు గడ్డివాము కాలిపోతోందోనని ప్రతిసారి చింతించాడు. ఇలా మూడేళ్లలో నాలుగైదు సార్లు కాలిపోయింది. ఈసారి ఇందుకు గల కారణం తెలుసుకోవాలనుకున్నాడు. అందుకే సీసీకెమెరాలు ఏర్పాటు చేశాడు. దొంగ దొరికాడు.
CC Camera
ఇది గమనించని నిందితుడు ఎప్పటిలాగే ఈసారి గడ్డివాము తగులపెట్టేందుకు ప్రయత్నించి పట్టుబడ్డాడు. ఈ చర్యకు పాల్పడింది... అదే గ్రామానికి చెందిన వాంకుడోత్ బుచ్చగా గుర్తించారు. నిందితుడిని ఓ స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేశారు.అయితే గడ్డివాము ఎందుకు తగలపెట్టాడనే విషయం తెలుసుకునేందుకు పోలీసులకు అప్పగించారు.
ఇదీ చదవండి:Alcohol consumption effects on health : సరదాగా మొదలై.. వ్యసనమై వేధిస్తుంది..!