ఎంపీ నామా నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావుపై ఎన్నికల నిబంధనల ఉల్లంఘనల కేసులను ప్రజా ప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం కొట్టివేసింది. ఓటర్లను ప్రలోభ పెట్టారనే అభియోగంపై గత ఎన్నికల సమయంలో నమోదైన కేసులు వీగిపోయాయి.
ఎంపీ నామ, మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావుకు కోర్టులో ఊరట - ప్రజాప్రతినిధుల కోర్టు తాజా విచారణలు
ఎంపీ నామా నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావుకు ప్రజాప్రతినిధుల కోర్టులో ఊరట లభించింది. ఎన్నికల నిబంధనల ఉల్లంఘనల కేసులను ప్రజా ప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం కొట్టివేసింది.
nama and jalagam
నామ నాగేశ్వరరావుపై ఖమ్మంలో నమోదైన కేసుతో పాటు.. జలగం వెంకట్రావుపై కొత్తగూడెం, పాల్వంచ పట్టణ, పాల్వంచ గ్రామీణ పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులను న్యాయస్థానం కొట్టివేసింది. పోలీసులు దాఖలు చేసిన అభియోగపత్రాలకు తగిన ఆధారాలు లేకపోవడంతో కేసులు వీగిపోయాయి.
ఇదీ చూడండి:తెలంగాణ ఉద్యోగులను రిలీవ్ చేసేందుకు ఏపీ ప్రభుత్వం కసరత్తు