కారు దగ్ధమైన ఘటనలో డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించటం వల్ల ఆరుగురు ప్రాణాలతో బయటపడ్డారు. ఖమ్మం నగరంలోని చర్చి కాంపౌండ్ పైవంతెనపై సోమవారం ఓ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్ వేణు కారు ఇంజిన్ ఆఫ్ చేసి ఆరుగురు ప్రయాణికులను కిందికి దించారు.
కారులో మంటలు.. తప్పిన ప్రాణాపాయం - తాజా వర్త కారులో మంటలు
ఖమ్మం నగరంలోని పైవంతెనపై ఓ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడం వల్ల ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు.
కారులో మంటలు.. తప్పిన ప్రాణాపాయం
మణుగూరుకు చెందిన వంశీ తన కుటుంబ సభ్యులతో ఖమ్మంలోని పెళ్లికి వెళ్తున్నారు. రాత్రి 8గంటల సమయంలో ఖమ్మం పైవంతెన మీదకు రాగానే కారులో మంటలు దగ్ధం అయ్యింది. ట్రాఫిక్ పోలీసులు, అగ్ని మాపక శాఖ అధికారులు ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.
ఇదీ చూడండి: దిశ హత్య కేసు: నిందితుల్లో ఇద్దరు మైనర్లు?