ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం పల్లిపాడు గ్రామ సమీపంలో కారు బైక్ ఢీకొని రాంపూడి వెంకటేశ్వర్లు అనే వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందాడు. పల్లిపాడు గ్రామానికి చెందిన ఆయన టీవీఎస్ బైక్పై గ్రామ సమీపంలోని తన పంట చేను వద్దకు వెళ్తుండగా వైరా వైపు నుంచి ఖమ్మం వెళ్తున్న కారు అతివేగంగా వచ్చి ఢీ కొట్టింది.
కారు- బైక్ ఢీ.. ఒక్కరు మృతి - Car, Bike Accident at Pallipadu Village
ఖమ్మం జిల్లా పల్లిపాడులో విషాదం చోటుచేసుకుంది. గ్రామ సమీపంలో కారు- బైక్ ఢీ కొనటం వల్ల రాంపూడి వెంకటేశ్వర్లు అనే వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందాడు. అతడి మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలుముకొన్నాయి.

కారు-బైక్ ఢీ... వ్యక్తి మృతి
ఈ ఘటనలో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.