Candidates Won in Three Parties Telangana: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన ముగ్గురు అభ్యర్థులు అరుదైన రికార్డును తమ ఖాతాలో వేసుకున్నారు. మూడు వేరు వేరు పార్టీల నుంచి పోటీ చేసి గెలిచి తమ సత్తా చాటారు. వారే తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, పాయం వెంకటేశ్వర్లు. వీరు పోటీ చేసిన మూడు పార్టీల నుంచి విజయకేతనం ఎగురవేశారు.
Thummala Nageswara Rao Won 3 Parties: 1983 నుంచి 2004 వరకు సత్తుపల్లిలో, 2009, 2014 ఎన్నికల్లో ఖమ్మం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా తుమ్మల నాగేశ్వరరావు మొత్తం ఎనిమిది సార్లు బరిలో నిలిచారు. సత్తుపల్లి నుంచి 1985, 1994, 1999లో గెలుపొందారు. 1983, 1989లో తుమ్మల ఓడిపోయారు. 2009 ఎన్నికల్లో ఖమ్మంలో గెలిచిన ఆయన 2014లో ఓడిపోయారు. దీంతో బీఆర్ఎస్(టీఆర్ఎస్) పార్టీలో చేరారు. ఆ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.
2014లో పాలేరు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందిన రాంరెడ్డి వెంకట్రెడ్డి మరణించడంతో జరిగిన ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థిగా తుమ్మల బరిలో నిలిచి ఘన విజయం(Thummala Won as a BRS Candidate) సాధించారు. 2018 ఎన్నికల్లో ఆయన అదే పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోవడంతో అసంతృప్తి చెంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ పార్టీ నుంచి బరిలోకి దిగిన తుమ్మల గెలుపొందారు.
Tummala Nageshwara Rao Rally in Khammam : 1000 కార్లు, 2 వేల బైకులతో తుమ్మలకు ఘన స్వాగతం