ఖమ్మం జిల్లా ఏన్కూర్‌లో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్‌యార్డు ఛైర్మన్ భూక్యా లాలు నాయక్ ప్రారంభించారు. రైతులు నాణ్యమైన పత్తిని సీసీఐ కేంద్రానికి తరలించి మద్దతుధర పొందాలని ఆయన కోరారు.
'సీసీఐ కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి'
మార్కెట్ యార్డుల్లో పత్తి కొనుగోలు కేంద్రాలను రైతులు వినియోగించుకోవాలని ఛైర్మన్ భూక్యా లాలు నాయక్ అన్నారు. ఖమ్మం జిల్లా ఏన్కూర్ మార్కెట్‌యార్డులో ఏర్పాటు చేసిన సీసీఐ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.
'సీసీఐ కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి'
రాష్ట్రప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలిపారు. పత్తి రైతుల కోసం అన్ని మార్కెట్‌యార్డుల్లో సీసీఐ కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో సోసైటీ ఛైర్మన్ శెట్టిపల్లి వెంకటేశ్వరరావు, మార్కెట్ కార్యదర్శి శ్రీనివాసరావు, వ్యాపారులు, రైతులు పాల్గొన్నారు.