శివరాత్రి జాతరలో భాగంగా ఎద్దుల పోటీలు - ఎద్దుల పోటీలు
మహా శివరాత్రి సందర్భంగా ఖమ్మం జిల్లా మధిరలో ఎద్దుల పోటీలు జరిగాయి. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు రైతులు ఈ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.
శివరాత్రి జాతరలో భాగంగా ఎద్దుల పోటీలు
మహా శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఖమ్మం జిల్లా మధిర శివాలయం వద్ద ఎద్దుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు రైతులు తమ ఎద్దులతో పాల్గొన్నారు. గుంటూరు, విజయవాడ, నందిగామ, కంచికచర్ల, పెనుగంచిప్రోలు, తిరువూరు వంటి ప్రాంతాల నుంచి రైతులు ఉత్సాహంగా పోటీ పడ్డారు. ఆలయ కమిటీ ఛైర్మన్ శ్రీనివాసరావు, రైతు కమిటీ ఆధ్వర్యంలో ఈ పోటీలు హోరాహోరీగా సాగాయి.