ఖమ్మం జిల్లాలో గుత్తేదార్లు చెల్లించే డబ్బుల విషయంలో తారతమ్యాలపై భవన నిర్మాణ కార్మికులు ఆందోళనకు దిగారు. తమపై వివక్ష చూపుతున్నారని మూడు రోజుల సమ్మె చేపట్టారు. అందరికి సమానంగా చెల్లించాలని డిమాండ్ చేస్తూ.... నిర్మాణంలో ఉన్న పనులను ఆపి ధర్నా నిర్వహిస్తున్నారు. విషయం తెలియని కొంత మంది కూలీలు అడ్డాల వద్దకు చేరుకొని పని దొరక్క ఇంటికి వెళ్లి పోతున్నారు.
'సమాన వేతనాలిస్తేనే సమ్మె ఆపేస్తాం' - WORKERS
రోజూ పని చేస్తే కానీ వారి పొట్ట గడవదు. అలాంటి రోజువారి కూలీలకు గుత్తేదార్లు డబ్బులు సరిగా ఇవ్వకుండా, తారతమ్యాలు చూపించడం నచ్చలేదు. సమాన పనికి సమాన వేతనమంటూ మూడ్రోజుల సమ్మెకు దిగారు.
'సమాన వేతనాలిస్తేనే సమ్మె ఆపేస్తాం'