BRS Election Plan In Khammam 2023 : అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ మరింత దూకుడు పెంచేందుకు ముమ్మరంగా సమాయత్తమవుతోంది. అభ్యర్థుల ప్రకటన నుంచి ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్ధి పార్టీల కన్నా ఒక అడుగు ముందున్న అధికార పార్టీ..ఎన్నికల నోటిఫికేషన్కుసమయం దగ్గరపడుతున్న వేళ.. మరింత విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లేలా అడుగులు వేస్తోంది. ఇందుకోసం ఉమ్మడి ఖమ్మం జిల్లాపై ప్రత్యేక గురి పెట్టిన గులాబీ దళపతి కేసీఆర్.. పాలేరు నుంచి ఎన్నికల సమరశంఖం పూరించేందుకు సన్నద్ధమవుతున్నారు.
KCR Election campaign in Khammam 2023: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెండు అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన నిరాశజనకమైన ఫలితాలు ఎదుర్కొన్న బీఆర్ఎస్.. మూడోసారి మళ్లీ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు కదనరంగంలోకి దూకింది. అయితే.. గత రెండు ఎన్నికల్లో చవిచూసిన ఫలితాలు గులాబీ పార్టీని ఇంకా కలవరపెడుతూనే ఉన్నాయి. దీంతో ఈసారి ఉమ్మడి ఖమ్మం జిల్లాపై ముఖ్యమంత్రి ప్రత్యేక నజర్ పెట్టారు. ఎన్నికలకు ముందు నుంచే ప్రత్యేక కార్యాచరణతో వ్యూహాత్మకంగా రాజకీయ అడుగులు వేస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇంఛార్జీలను నియమించి ఎన్నికల క్షేత్రంలోకి దూకారు. నియోజకవర్గాల వారీగా ఇప్పటికే రంగంలోకి దిగిన పార్టీ అభ్యర్థులు, నేతలు.. విస్తృతంగా ప్రజల్లోకి వెళ్తుండటంతో ప్రచారపర్వంలో బీఆర్ఎస్ముందువరుసలో ఉంది.
CM KCR Election Campaign Vehicle : ఎన్నికలకు కేసీఆర్ ప్రచారరథం సిద్ధం.. హుస్నాబాద్‌లో తొలి శంఖారావం
BRS Focus On Khammam Politics 2023 : బహిరంగ సభలతో ప్రచారం ముమ్మరం చేసిన బీఆర్ఎస్.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తొలి దఫాలో 5 నియోజకవర్గాల్లో నిర్వహించేందుకు ప్రణాళికలు చేశారు. 27న పాలేరు, నవంబర్ 1న సత్తుపల్లి, ఇల్లందు, 5న కొత్తగూడెం, ఖమ్మం నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా కూసుమంచి మండలం జీళ్లచెర్వులో ప్రజా దీవెన పేరిట బీఆర్ఎస్ బహిరంగ సభను నిర్వహించనుంది. పాలేరు బీఆర్ఎస్ అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ నిర్వహించే ఈ సభకు ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి హాజరుకానున్నారు. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పాలేరు నేతలు.. సూర్యాపేట-ఖమ్మం రహదారి పక్కన దాదాపు 25 ఎకరాల్లో సభా ఏర్పాట్లు చేస్తున్నారు. పక్కనే ప్రత్యేక హెలీప్యాడ్ సిద్ధం చేస్తున్నారు. నియోజకవర్గంలోని 4 మండలాల నుంచి వేలాదిగా జనసమీకరణ చేయనున్నారు.