BRS Chief KCR Speech in BRS Public Meeting at Madhira : పట్టిలేని భట్టి విక్రమార్కకు మళ్లీ ఓటేస్తే ఇక్కడి ప్రజలకు ఏమీరాదని.. కాంగ్రెస్కు మళ్లీ 20 సీట్లు మాత్రమే వస్తాయని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్(CM KCR) అన్నారు. అందుకే ఈసారి బీఆర్ఎస్ అభ్యర్థి కమల్రాజును గెలిపిస్తే.. మధిర నియోజకవర్గంలోని దళితులందరికీ దళిత బంధు ఇస్తామని హామీ ఇచ్చారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు.
దేశానికే అన్నపూర్ణగా తెలంగాణ తయారైందని.. ప్రతి ఇంటికి మంచినీరు ఇచ్చే ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ అని సీఎం కేసీఆర్ కొనియాడారు. చిత్తశుద్ధితో పని చేస్తేనే విజయాలు సాధ్యమవుతాయని అన్నారు. మధిరలో కాంగ్రెస్ తరఫున గెలిచిన భట్టిపై ఎలాంటి వివక్ష లేదని తెలిపారు. ఉత్తర భారతదేశంలో దళితులపై భయంకరమైన దాడులు జరుగుతున్నాయని ఆవేదన చెందారు. అందుకే దళితబంధు(Dalith Babdhu)లో రిజర్వేషన్లు పెట్టి వారికి ఇస్తున్నామని హర్షించారు. ఈ నియోజకవర్గంలో భట్టి విక్రమార్క గెలిస్తే ఆరు నెలలకు ఒక్కసారి మాత్రమే ఇక్కడకు వస్తున్నారని విమర్శించారు.
ఎన్నికల్లో గెలవాల్సింది ప్రజలే అందుకే ఆలోచించి ఓటేయండి : కేసీఆర్
CM KCR Fires on Congress Party :50 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ ఏం చేసిందో ఒకసారి ఆలోచించాలని సభికులను కోరారు. ఒకనాడు ఉన్న తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్రెస్.. బలవంతంగా తీసుకెళ్లి ఆంధ్రలో కలిపి ఇబ్బంది పెట్టారని గుర్తు చేశారు. పైగా కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వకుండా.. అప్పటి టీఆర్ఎస్(బీఆర్ఎస్) పార్టీని చీల్చే ప్రయత్నం చేసిందని ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ హయాంలో మధిరలో కరెంటు ఉండేలా.. ఇప్పుడు బీఆర్ఎస్ వల్ల నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామని సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. రైతుబంధు ఇవ్వొద్దు.. కరెంటు ఇవ్వొద్దని కాంగ్రెస్ అంటోందన్నారు. ధరణి స్థానంలో భూమాత పెడతారట.. వాళ్లు పెట్టేది భూమాత కాదు భూమేత అని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ను గెలిపిస్తే అభివృద్ధి ముందుకెళుతుంది.. కాంగ్రెస్ గెలిస్తే అభివృద్ధి ఉందని.. మళ్లీ కథ మొదటికేనని తెలిపారు.
"ప్రజాస్వామ్యంలో ప్రజల వద్ద ఉండే బలమైన ఆయుధం ఓటు. వచ్చే ఐదు సంవత్సరాలకు మీ రాష్ట్ర భవితవ్యాన్ని నిర్ణయిస్తుంది. మధిర చాలా చైతన్యవంతమైన ప్రాంతం. రెండుసార్లు జరిగిన ఎన్నికల్లో మీరు బీఆర్ఎస్ను గెలిపించలేదు. అయినా మీ మీద నాకు కోపం లేదు. దళితబంధును కూడా ఇక్కడ ఇచ్చాము. కాంగ్రెస్ అభ్యర్థి భట్టి విక్రమార్క ఉన్నారని నేను కక్ష కట్టలేదు. దళిత సమాజం ఎప్పటికీ అలాగా దిగువనే ఉండాలా.. అందుకే దళితబంధు తీసుకువచ్చాను."- కేసీఆర్, బీఆర్ఎస్ అధినేత
BRS Praja Ashirvada Sabha At Madhira :అమెరికాలో ఎన్నికల కోసం ప్రచార సభలు జరగవని.. ఎన్నికల్లో జాగ్రత్తగా ఓటు వేసే విధానంగా రావాలని సీఎం కేసీఆర్ సూచించారు. 75 ఏళ్ల ప్రజాస్వామ్య ప్రక్రియలో రావాల్సిన పరిణతి ఇంకా రాలేదని ఆవేదన చెందారు. మీ ఓటు మీ భవిష్యత్తుతో పాటు రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయిస్తోందన్నారు. అభ్యర్థులతో పాటు వారి పార్టీల చరిత్రను కూడా ఒకసారి చూడాలని హితవు పలికారు. బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసమని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ను గెలిపిస్తే అభివృద్ధి ముందుకు - కాంగ్రెస్ గెలిస్తే అభివృద్ధి ఉండదు కాంగ్రెస్ మన ఓటుతో మన కళ్లల్లోనే పొడిపించాలని చూస్తోంది: కేసీఆర్
'బీఆర్ఎస్ పోరాటానికి భయపడే నాడు కాంగ్రెస్ ప్రత్యేక తెలంగాణ ఇచ్చింది'