ఖమ్మం జిల్లా తల్లాడలో పద్మావతి సమేత వెంకటేశ్వరస్వామి ఆలయంలో 17వ బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. నాలుగోరోజు స్వామికి హోమం, సహస్రనామ పూజలు నిర్వహించారు. ప్రత్యేక పూజలు తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఉత్సవమూర్తులను పట్టణంలో ఊరేగింపుగా తీసుకెళ్లారు. మేళతాళాల నడుమ గరుడ వాహనంపై ఊరేగుతున్న స్వామిని చూసి భక్తులు మంత్రముగ్ధులయ్యారు.
తల్లాడలో ఘనంగా వెంకన్న బ్రహ్మోత్సవాలు - తల్లాడలో ఘనంగా వెంకన్న బ్రహ్మోత్సవాలు
ఖమ్మం జిల్లా తల్లాడలో పద్మావతి సమేత వెంకటేశ్వరస్వామి ఆలయంలో 17వ బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామికి హోమం, సహస్రనామ పూజలు ఘనంగా నిర్వహించారు.
తల్లాడలో ఘనంగా వెంకన్న బ్రహ్మోత్సవాలు