ఖమ్మంజిల్లా బొక్కలగడ్డ బజారుకు చెందిన ప్రేమ్ సాగర్ అనే బాలుడు గురువారం మధ్యాహ్నం ఆడుకోవడానికని ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. చుట్టుపక్కల వెతికిన తల్లిదండ్రులు మూడో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రేమ్ సాగర్ ఇంటి పక్కన శిథిలావస్థలో ఉన్న ఇంట్లో నుంచి దుర్వాసన రావడం వల్ల స్థానికులు వెళ్లి చూడగా బాలుడు ఉరివేసుకొని ఉన్నట్లు కనిపించింది. పోలీసులకు సమాచారం అందించడంతో అనుమానాస్పద మృతి కింద దర్యాప్తు చేస్తున్నారు. కళ్లముందు ఆడుకునే చిన్నారి మృత్యువాత పడటం వల్ల కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
ఖమ్మంలో బాలుడి అనుమానాస్పద మృతి - శిథిలావస్థ
మూడు రోజుల క్రితం ఆడుకునేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లిన బాలుడు పాడుబడ్డ ఓ ఇంట్లో ఉరివేసుకొని మృతి చెందిన ఘటన ఖమ్మం నగరంలో చోటు చేసుకుంది.
ఖమ్మంలో బాలుడి అనుమానాస్పద మృతి