తెలంగాణ

telangana

ETV Bharat / state

ఈత కోసం బావిలో దిగాడు... మృతదేహమై తేలాడు... - ప్రాణం తీసిన ఈత సరదా

స్నేహితులతో కలిసి ఈత కొట్టేందుకు వెళ్లిన పదో తరగతి విద్యార్థి... బావిలో మునిగి చనిపోయిన ఘటన కొణిజర్ల మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

boy-died-into-agriculture-water-well-at-khammam
ఈత కోసం బావిలో దిగాడు... మృతదేహమై తేలాడు...

By

Published : May 22, 2020, 10:26 AM IST

ఖమ్మంలోని రామచంద్రయ్యనగర్‌కు చెందిన యువరాజు, జంగం మనోజ్‌శ్రావణ్‌, కొణిజర్లలోని వెల్డింగ్‌ దుకాణంలో పనిచేస్తున్న దేశబోయిన వేణుకు స్నేహితులు. యువరాజు, శ్రావణ్‌ గురువారం కొణిజర్లకు వచ్చి... వేణుతో కలిసి తిరిగారు. అనంతరం కొణిజర్ల నుంచి మల్లుపల్లి వెళ్లే రహదారి పక్కన పొలంలో ఉన్న బావి దగ్గర ఈతకు వెళ్లారు.

ఈత కొడుతుండగా యువరాజు అకస్మాత్తుగా మునిగిపోవడాన్ని స్నేహితులు గమనించారు. మిగతా ఇద్దరు భయపడి బావి పైకి ఎక్కి రక్షించమని పరుగులు తీశారు. సమీపంలోని స్థానికులు వచ్చి చూసి బయటకు తీసేసరికి అప్పటికే యువరాజు మృతిచెందాడు. మృతుడు ప్రస్తుతం పదో తరగతి చదువుతున్నాడు.

పోలీసులు ఘటనా స్థలం వద్దకు చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. సంఘటన స్థలం వద్ద పోలీసులకు మత్తుకోసం పీల్చే బోనోఫిక్స్‌ ట్యూబ్‌లు దొరికాయి. తల్లిదండ్రులు రవి, సుజాత, బంధువులు ఘటనా స్థలం వద్ద కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం తరలించి విచారణ చేస్తున్నారు.

ఇవీ చూడండి:మిమ్మల్ని ఇంటికి చేర్చే బాధ్యత మాది: కేసీఆర్​

ABOUT THE AUTHOR

...view details