ఖమ్మం జిల్లాలోని 20 ప్రభుత్వ పాఠశాలలకు ఎన్ఆర్ఐ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పుస్తకాలను సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య సమక్షంలో కలెక్టర్ ఆర్. వి. కర్ణన్‌కు అందజేశారు. మాతృదేశంపై ఉన్న ప్రేమ, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం తమ వంతు చేయూతనిస్తున్నట్లు ఎన్ఆర్ఐలు చెప్పారు.
తెలుగు రాష్ట్రాల్లోని 350 ప్రభుత్వ పాఠశాలలకు ఎన్ఆర్ఐ ఫౌండేషన్ వారు పుస్తకాలు అందజేస్తున్నారని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కొనియాడారు.
'ప్రభుత్వ పాఠశాలలో ఉచిత పుస్తకాల పంపిణీ' - పుస్తకాల పంపిణీ
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో పుస్తక పఠనం పెంపొందించేందుకు ఎన్ఆర్ఐలు చేస్తున్న కృషి అభినందనీయమని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు. ఖమ్మంలోని ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత పుస్తకాల పంపిణీని చేశారు.
'ప్రభుత్వ పాఠశాలలో ఉచిత పుస్తకాల పంపిణీ'
ఇదీ చూడండి: ప్లాస్టిక్ రహిత సమాజ స్వాప్నికుడు ఈ షాపు యజమాని