ఖమ్మం జిల్లాలో శ్రావణమాసం సందర్భంగా అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఏనుకూరు, కొనిజర్ల, వైరా, జూలూరుపాడు మండలాల్లోని మహిళలు ఉదయాన్నే గ్రామదేవతల వద్ద పూజలు చేశారు. బోనాలతో ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. జాతరలో వైరా ఎమ్మెల్యే రాములునాయక్ పాల్గొన్నారు. బోనం ఎత్తుకుని ముత్యాలమ్మ దేవతకు పూజలు చేశారు.
అమ్మవారికి ఘనంగా బోనాలు సమర్పణ - అమ్మవారికి ఘనంగా బోనాలు సమర్పణ
శ్రావణమాసం సందర్భంగా అమ్మవారికి సమర్పించే బోనాల కార్యక్రమం ఖమ్మం జిల్లావ్యాప్తంగా ఘనంగా జరిగింది.
అమ్మవారికి ఘనంగా బోనాలు సమర్పణ