తెలంగాణ

telangana

ETV Bharat / state

కేటీఆర్ జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు - minister ktr birthday news

ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు జన్మదిన వేడుకలు ఖమ్మం జిల్లా తల్లాడలో ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య నేతృత్వంలో నారాయణపురంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు.

కేటీఆర్ జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు
కేటీఆర్ జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు

By

Published : Jul 24, 2020, 12:26 PM IST

ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు జన్మదిన వేడుకలు ఖమ్మం జిల్లా తల్లాడలో ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య నేతృత్వంలో నారాయణపురంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. శిబిరానికి వివిధ మండలాల నుంచి యువకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రక్తదానానికి ముందుకు వచ్చిన దాతలను ఎమ్మెల్యే అభినందించారు. ఆపదలో ఉన్న వారికి రక్తదాతలు అందిస్తున్న సేవ అభినందనీయమన్నారు.

పంచాయతీ రాజ్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్... పట్టణాలు, గ్రామాల అభివృద్ధికి విశేష కృషి చేస్తున్నారన్నారు. పురపాలికలపై దృష్టి పెట్టి ప్రజా సమస్యలు పరిష్కరిస్తున్నారన్నారు. ఎమ్మెల్యేతో పాటు డీసీఎంఎస్ ఛైర్మన్ రాయల్ వెంకట శేషగిరిరావు, ఎంపీపీ దొడ్డా శ్రీనివాసరావు, జడ్పీటీసీ దేశాల ప్రమీల, తెరాస మండల అధ్యక్ష కార్యదర్శులు మోహన్ రెడ్డి, దుగ్గి దేవర వెంకట్లాల్, తెరాస నాయకులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details