రాష్ట్రంలో నిరుద్యోగులకు భృతి ఇవ్వకుండా సీఎం మోసం చేశారని ఖమ్మం జిల్లా భాజపా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ విమర్శించారు. ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలంటూ బీజేవైఎం కార్యకర్తల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు.
ఉద్యోగాలు భర్తీ చేయాలని బీజేవైఎం రాస్తారోకో - ఉద్యోగాలు భర్తీ చేయాలంటూ బీజేవైఎం ధర్నా
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలంటూ భాజపా నాయకులు రాస్తారోకో నిర్వహించారు. ఖమ్మం జిల్లా బీజేవైఎం ఆధ్వర్యంలో రహదారులపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు ఆందోళనకారులను ఠాణాకు తరలించారు.
ఉద్యోగాలు భర్తీ చేయాలంటూ బీజేవైఎం రాస్తారోకో
రాష్ట్రంలో వెంటనే ఉద్యోగ నియామకాలు చేపట్టాలని రాపర్తీనగర్ వంతెన వద్ద రహదారిపై బైఠాయించారు. సమాచారం అందుకున్న పోలీసులు నిరసనకారులను అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.