తెలంగాణ

telangana

ETV Bharat / state

పంచభూతాలను దోచుకుంటున్న పార్టీ తెరాస: బండి సంజయ్​ - telangana varthalu

అక్రమాలను సక్రమం చేసుకునేందుకే చాలా మంది తెరాసలో చేరారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ ఆరోపించారు. పంచభూతాలను దోచుకుంటున్న పార్టీ తెరాస అని.. పూజిస్తున్న పార్టీ భాజపా అని ఆయన అన్నారు.

పంచభూతాలను దోచుకుంటున్న పార్టీ తెరాస: బండి సంజయ్​
పంచభూతాలను దోచుకుంటున్న పార్టీ తెరాస: బండి సంజయ్​

By

Published : Jan 8, 2021, 4:02 PM IST

Updated : Jan 8, 2021, 4:57 PM IST

కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో అధికార పార్టీ నేతలు లక్ష కోట్లు తిన్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ ఆరోపించారు. పాలించమని ప్రజలు అధికారమిస్తే ప్రగతిభవన్‌కే పరిమితమయ్యారని ఆయన విమర్శలు గుప్పించారు. ఖమ్మం పర్యటనలో భాగంగా ఆయన మీడియాతో చిట్​చాట్​ నిర్వహించారు. అక్రమాలను సక్రమం చేసుకునేందుకు చాలామంది తెరాసలో చేరారని బండి అన్నారు. పంచభూతాలను దోచుకుంటున్న పార్టీ తెరాస... పూజిస్తున్న పార్టీ భాజపా అని ఆయన పేర్కొన్నారు.

తెలంగాణ ప్రజలు అవినీతి నిరోధక వ్యాక్సిన్ కనుగొన్నారని... దుబ్బాకలో అవినీతి నిరోధక వ్యాక్సిన్ ట్రయల్‌ విజయవంతం అయ్యిందన్నారు. త్వరలోనే రాష్ట్రం మొత్తం అవినీతిరహితం అవుతుందని సంజయ్‌ తెలిపారు. భాష విషయంలో సీఎం కేసీఆర్‌కు గురుదక్షిణ చెల్లిస్తున్నానని బండి ఎద్దేవా చేశారు.

పంచభూతాలను దోచుకుంటున్న పార్టీ తెరాస: బండి సంజయ్​

ఇదీ చదవండి: ఈనెల 11న మంత్రులు, కలెక్టర్లతో సీఎం కేసీఆర్ సమీక్ష

Last Updated : Jan 8, 2021, 4:57 PM IST

ABOUT THE AUTHOR

...view details