ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల వేళ అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తెరాస వైఫల్యాలపై భాజపా ఛార్జ్‌షీట్ విడుదల చేసింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో తెరాస విఫలమైందంటూ 10 అంశాలతో భాజపా ఎన్నికల కన్వీనర్ చింతల రాంచంద్రారెడ్డి ఛార్జ్‌షీట్ విడుదల చేశారు.
తెరాస వైఫల్యాలపై ఛార్జ్‌షీట్ విడుదల చేసిన భాజపా - telangana latest news
ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల వేళ తెరాస వైఫల్యాలపై భాజపా ఛార్జ్‌షీట్ రూపొందించింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో ఆ పార్టీ విఫలమైందంటూ 10 అంశాలతో భాజపా ఎన్నికల కన్వీనర్ చింతల రాంచంద్రారెడ్డి ఛార్జ్‌షీట్ విడుదల చేశారు.

BJP chargesheet on Trs's failures
ఈ సందర్భంగా నగరంలో రెండున్నర లక్షల కరపత్రాలు పంపిణీ చేయనున్నట్లు చింతల వెల్లడించారు. తెరాస పాలకవర్గం చేసిన పాపాలే.. ఖమ్మం ప్రజలకు శాపాలు అన్న నినాదంతో ఈ ఎన్నికల్లో భాజపా నగర ప్రజలను ఓట్లు అభ్యర్థిస్తుందని స్పష్టం చేశారు. రెండ్రోజుల్లో ఖమ్మంలో ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటిస్తామన్నారు.
ఇదీ చూడండి:మహమ్మారి కట్టడికి కేంద్రం అహర్నిశలు కృషి చేస్తోంది: బండి సంజయ్