లాక్డౌన్ సమయంలో విద్యుత్ బిల్లులు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ ఖమ్మంలో ధర్నా నిర్వహించింది. నగరంలోని ఎస్ఈ కార్యాలయం ఎదుట విద్యుత్ బిల్లులు రద్దు చేయాలని నాయకులు ప్లకార్డులు ప్రదర్శించారు. పోలీసులు వారిని లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. ధర్నా అనంతరం ఎస్‌ఈకి వినతిపత్రం సమర్పించారు. కేంద్రం ప్రకటించిన 20లక్షల కోట్ల ప్యాకేజీలో విద్యుత్ బిల్లులకు సంబంధించి పదివేల కోట్లు ఉన్నాయని నాయకులు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుంచి వచ్చిన నిధులను కాజేసీ ప్రజలపై విద్యుత్ బిల్లుల భారం మోపుతుందని ఆరోపించారు.
విద్యుత్ బిల్లుల మోతపై భాజపా నిరసన.. ఎస్‌ఈకి వినతి - ఖమ్మం ఎస్ఈ కార్యాలయం ఎదుట బీజేపీ నేతల ధర్నా
విద్యుత్ బిల్లులు రద్దు చేయాలని భారతీయ జనతా పార్టీ నిరసనకు దిగింది. ఖమ్మంలో ఎస్ఈ కార్యాలయం ఎదుట నేతలు ధర్నా నిర్వహించారు. అనంతరం ఎస్‌ఈకి వినతి పత్రం అందించారు.
విద్యుత్ బిల్లులు రద్దు చేయాలని భాజపా ధర్నా
TAGGED:
భారతీయ జనతా పార్టీ