ఖమ్మం జిల్లా భాజపా కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఆ పార్టీ కార్యకర్త గంగుల శ్రీనివాస్ మృతికి నిరసన తెలిపేందుకు కార్యకర్తలు పార్టీ కార్యాలయం నుంచి బయటికి వచ్చారు. కార్యాలయం ఎదుట వారిని అడ్డుకున్న పోలీసులు అరెస్టు చేసేందుకు యత్నించారు.
దీంతో ఆందోళనకారులు.. ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేసేందుకు యత్నించారు. ఈ క్రమంలో పోలీసులు, ఆందోళనకారుల మధ్య ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఖమ్మం బైపాస్ వైపుకు వెళ్లేందుకు యత్నించిన వారిని పోలీసులు అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు.