ఖమ్మం జిల్లా ఏన్కూరులో రైతులకు మద్దతు ధర కల్పించాలని కోరుతూ భాజపా ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఐటీసీకి వ్యతిరేకంగా ప్రదర్శన చేసి ప్రధాన కూడలిలో దిష్టిబొమ్మ దహనం చేశారు. రైతుల పట్ల ఐటీసీ సంస్థ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని భాజపా శ్రేణులు మండిపడ్డారు.
రైతులకు మద్దతు ధర కల్పించాలని ఏన్కూరులో ధర్నా - bjp protest at yenkuru
రైతులకు మద్దతు ధర కల్పించాలని భాజపా ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా ఏన్కూరులో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఐటీసీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రధాన కూడలిలో భౌతిక దూరం పాటిస్తూ దిష్టిబొమ్మ దహనం చేశారు.
రైతులకు మద్దతు ధర కల్పించాలని ఏన్కూరులో ధర్నా
దళారులను ప్రోత్సహిస్తూ రైతులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. రైతుల నుంచి నేరుగా కర్ర కొనుగోలు చేయాలని... మద్దతు ధర కల్పించాలని భాజపా జిల్లా నాయకులు కొవ్వూరు నాగేశ్వరరావు డిమాండ్ చేశారు.