ఎల్ఆర్ఎస్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ భాజపా ఆధ్వర్యంలో ఖమ్మం నగర పాలక సంస్థ కార్యాలయాన్ని ముట్టడించారు. కార్యాలయం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా.. పోలీసులు వారిని అడ్డుకుని అరెస్టు చేశారు. ఈ క్రమంలో పోలీసులకు ఆందోళనకారుల మధ్య తోపులాట జరిగింది.
ఎల్ఆర్ఎస్ విధానాన్ని రద్దు చేయాలంటూ కేఎమ్సీ ముట్టడి - ఖమ్మంలో భాజపా నేతలు ఎల్ఆర్ఎస్ను రద్దు చేయాలంటూ నిరసన
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎల్ఆర్ఎస్ విధానాన్ని రద్దు చేయాలని భాజపా ఆధ్వర్యంలో ఖమ్మంలో నిరసన చేపట్టారు. నగరపాలక సంస్థ కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించిన ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు.
ఎల్ఆర్ఎస్ విధానాన్ని రద్దు చేయాలంటూ కేఎమ్సీ ముట్టడి
అందరినీ అరెస్ట్ చేసి ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ తరలించారు. రాష్ట్ర ప్రభుత్వం పేద, మధ్యతరగతి ప్రజలను మరింత కష్టాల్లో నెట్టేందుకే ఎల్ఆర్ఎస్ విధానాన్ని తీసుకొచ్చిందని వెంటనే దాన్ని ఉపసంహరించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి:నవంబరు 3న దుబ్బాక ఉపఎన్నిక