ఖమ్మం నగర అభివృద్ధి అంటే కేవలం తాను, తన అనుచరవర్గం అభివృద్ధిగానే మంత్రి పువ్వాడ అజయ్ వ్యవహరిస్తున్నారని భాజపా జాతీయ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి విమర్శించారు. నాసిరకం పనులు చేపట్టడమే కాకుండా... ప్రజాప్రతినిధులే గుత్తేదారుల అవతారమెత్తారని ఆరోపించారు. ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నగరంలోని పలు డివిజన్లలో భాజపా అభ్యర్థులకు మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నారు.
ఖమ్మం నగర అభివృద్ధి భాజపాతోనే సాధ్యం: పురందేశ్వరి - ఖమ్మం మున్సిపల్ ఎన్నికలు
ఖమ్మం నగర అభివృద్ధి భాజపాతోనే సాధ్యమని ఆ పార్టీ జాతీయ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నగరంలోని పలు డివిజన్లలో భాజపా అభ్యర్థులకు మద్దతుగా నిర్వహించిన రోడ్‌షోలో ఆమె పాల్గొన్నారు.
ఖమ్మం వార్తలు
ఖమ్మం కార్పొరేషన్లో భాజపా ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఓటేయాలని... ఎవరికి పట్టంగడితే అభివృద్ధి జరుగుతుందో ప్రజలు గ్రహించాలని సూచించారు. కమలం గుర్తుపై ఓటువేసి భాజపా అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి:తెరాస-భాజపాలతో నగరానికి ఒరిగిందేం లేదు : రేవంత్ రెడ్డి