కాళేశ్వరం ప్రాజెక్టు శంకుస్థాపనకు వచ్చిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆ ప్రాజెక్టుపై ఆరోపణలు చేయడం సబబు కాదని భాజపా నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమమని ఏపీ ప్రభుత్వం ఎందుకు వాదిస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టు అక్రమంగా నిర్మిస్తున్నారని సుప్రీంకోర్టులో వాదించడం సబబుకాదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వైఖరి వల్లే ఇలాంటి పరిస్థితి నెలకొందని పొంగులేటి విమర్శించారు. రాజకీయ ప్రయోజనాల కంటే.. రాష్ట్ర ప్రయోజనాలే భాజపాకు ముఖ్యమన్న ఆయన.. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించాలని డిమాండ్ చేశారు.
'కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం వాదన సరికాదు' - భాజపా నేత పొంగులేటి మీడియా సమావేశం
ముఖ్యమంత్రి నియంతృత్వ పోకడవల్లే ఇప్పటి విభజన అంశాలపై అఖిల పక్షం సమావేశం ఏర్పాటు కాలేదని భాజపా నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి ఆరోపించారు.
'కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమమని ఏపీ ప్రభుత్వం వాదించడం సబబుకాదు'