మంత్రి అజయ్‌కుమార్ రెచ్చగోట్టే వ్యాఖ్యల వల్లనే జిల్లాలో ముగ్గురు ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యకు పాల్పడ్డారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఆరోపించారు. మంత్రి అజయ్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఖమ్మంలో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా డిపో వద్ద ధర్నాలో పాల్గొన్నారు. కార్మికుల పట్ల సీఎం కేసీఆర్ మొండి వైఖరితో ఉన్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు అక్షింతలు వేసినా... చలనం లేదని ఎద్దేవా చేశారు. భాజపా ఎంపీ సంజయ్‌పై దాడిని లక్ష్మణ్ ఖండించారు. భౌతిక దాడులతో ఉద్యమాన్ని ఆపలేరన్నారు. కేంద్రం అన్ని అంశాలను గమనిస్తుందని తెలిపారు.
రవాణాశాఖ మంత్రి అజయ్ రాజీనామా చేయాలి: లక్ష్మణ్ - TSRTC STRIKE TODAY
ఖమ్మంలో ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ మద్దతు తెలిపారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన మంత్రి అజయ్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎంపీ బండి సంజయ్‌పై జరిగిన దాడిని ఖండించారు.
BJP LAXMAN SUPPARTS KHAMMAM RTC STRIKE