తెలంగాణ

telangana

ETV Bharat / state

కొనుగోలు కేంద్రాల నిర్వహణ ఆగమ్యగోచరం : వెంకటేశ్వరరావు

ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ ఆగమ్యగోచరంగా ఉందని కిసాన్​మోర్చా ఖమ్మం జిల్లా అధ్యక్షుడు గుత్తా వెంకటేశ్వరరావు అన్నారు. జిల్లాలోని ఏన్కూరు, తల్లాడ మండలాల్లో భాజపా, కిసాన్​ మోర్చా నాయకుల బృందం కొనుగోలు కేంద్రాలను పరిశీలించింది.

By

Published : Apr 26, 2020, 9:51 PM IST

కిసాన్​ మోర్చా
కిసాన్​ మోర్చా

ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కిసాన్‌ మోర్చా ఖమ్మం జిల్లా అధ్యక్షుడు గుత్తా వెంకటేశ్వరరావు ఆరోపించారు. జిల్లాలోని ఏన్కూరు, తల్లాడ మండలాల్లో భాజపా కిసాన్‌మోర్చా నాయకుల బృందం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. స్థానిక రైతుల సమస్యలు తెలుసుకుని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు చరవాణి ద్వారా వివరించారు.

హడావిడిగా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ప్రభుత్వం రైతులకు ఎలాంటి ఉపయోగం లేకుండా చేస్తుందన్నారు. తరుగు, తేమ శాతం పేరుతో కొనుగోళ్లు చేయడం లేదని తెలిపారు. 90 శాతం రైతులు ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయిస్తున్నారని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో తెరాస నాయకులు, ప్రజాప్రతినిధులు గ్రామానికో కేంద్రం ఏర్పాటు చేశామని గొప్పలు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.

ఇదీ చదవండి:కరోనా వేళ 'మూర్తీ'భవించిన మానవత్వం

ABOUT THE AUTHOR

...view details