మార్పు కోసం భాజపాకు ఒక్క అవకాశం అంటూ ఖమ్మం నగర పాలక సంస్థ ఎన్నికలకు భాజపా ప్రచారం ప్రారంభించింది. నగర పరిధిలోని శాంతినగర్, పాకబండ బజార్లో ర్యాలీ నిర్వహించారు. వీధుల్లో ప్రచారం చేశారు.
ఖమ్మం బల్దియా ఎన్నికలకు భాజపా ర్యాలీ - telangana news
ఖమ్మం బల్దియా ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడకముందే భాజపా నాయకులు ప్రచారం ప్రారంభించారు. నగరంలోని పలు డివిజన్లలో ర్యాలీ నిర్వహించారు.

ఖమ్మంలో భాజపా ప్రచారం
నగర అధ్యక్షుడు రుద్రప్రదీప్ ఆధ్వర్యంలో జరిగిన ప్రదర్శనలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈసారి ఖమ్మం ఖిల్లాపై కాషాయపు జెండాఎగరవేయటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి:సాగర్ ఉపఎన్నిక ప్రచారంలో బండి సంజయ్