తెలంగాణ

telangana

ETV Bharat / state

కుదిరిన భాజపా, జనసేన పొత్తు..

ఖమ్మం బల్దియా ఎన్నికల్లో భాజపా- జనసేనల మధ్య సమన్వయం కుదిరింది. ఇరుపార్టీల మధ్య సీట్ల సర్దుబాటు చర్చలు ముగిశాయి. మొత్తం 60 స్థానాల్లో 54 వాటిలో కమలం పోటీ చేస్తుండగా, మిగిలిన 6 స్థానాల్లో జనసేన బరిలోకి దిగనుంది.

bjp and janasena alliances in khammam elections
భాజపా, జనసేన పొత్తు, ఖమ్మం బల్దియా ఎన్నికలు

By

Published : Apr 21, 2021, 6:51 PM IST

ఖమ్మం నగరపాలక సంస్థ ఎన్నికల్లో భాజపా- జనసేన పొత్తు ఖరారైంది. ఇప్పటికే ఇరుపార్టీల మధ్య పలుమార్లు సీట్ల సర్దుబాట్లపై చర్చోపచర్చలు సాగగా.. ఎట్టకేలకు ఆ ప్రక్రియ కొలిక్కి వచ్చింది. మొత్తం 60 డివిజన్లు ఉన్న కార్పొరేషన్​లో 54 స్థానాల్లో భాజపా, 6 స్థానాల్లో జనసేన అభ్యర్థులు బరిలోకి దిగేందుకు రెండు పార్టీలూ ఒప్పందం కుదుర్చుకున్నాయి.

గురువారం నామినేషన్ల ఉపసంహరణ ఉన్నందున జనసేనకు కేటాయించిన డివిజన్లలో భాజపా అభ్యర్థులు నామినేషన్ ఉపసంహరించుకుంటారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ వెల్లడించారు. ఈ సారి ఖమ్మం ఖిల్లాపై కాషాయజెండా ఎగురవేయడమే లక్ష్యమని ప్రకటించారు.

ఇదీ చదవండి:రాష్ట్రంలో 600 మంది ఎస్బీఐ ఉద్యోగులకు కరోనా

ABOUT THE AUTHOR

...view details