తెలంగాణ

telangana

ETV Bharat / state

మున్సిపల్​ ఎన్నికల్లో భాజపా, జనసేన పొత్తు - ఖమ్మం మున్సిపల్ ఎన్నికల్లో కలిసి పోటీ

రాష్ట్రంలో భాజపా, జనసేన మధ్య పొత్తు కుదిరింది. ఈనెల 30న జరగనున్న మున్సిపల్​ ఎన్నికల్లో కలిసి పోటీ చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. జనసేన అధినేత పవన్​ కల్యాణ్​ ఆదేశాలతో ఖమ్మం నగరపాలికలో పోటీపై స్పష్టత వచ్చినట్లు తెలిపారు.

BJP and Jana Sena will contest in khammam
ఖమ్మంలో కలిసి పోటీ చేయనున్న భాజపా , జనసేన

By

Published : Apr 18, 2021, 4:39 PM IST

రాష్ట్రంలో జరగనున్న పుర ఎన్నికల్లో భాజపా, జనసేన కలిసి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఖమ్మం నగరపాలిక ఎన్నికల్లో ఇరు పార్టీలు కలిసి పోటీ చేయనున్నాయి. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆదేశాలతో రెండు పార్టీల నాయకులు చర్చలు జరిపారు. ఖమ్మం నగరపాలికలో పోటీ చేసే అంశంపై నేతల మధ్య స్పష్టత వచ్చినట్టు తెలిపారు.

ఎవరెవరు ఎక్కడెక్కడ పోటీ చేయాలనేది మరోసారి జరిగే చర్చల్లో నిర్ణయించనున్నారు. ఈ చర్చల్లో జనసేన తరఫున రాష్ట్ర ఇంఛార్జ్‌ శంకర్‌గౌడ్‌, రామ్‌ తాళ్లూరి, పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి వి.వి.రామారావు పాల్గొన్నారు. భాజపా తరఫున రాష్ట్ర ఉపాధ్యక్షుడు చింతల రామచంద్రారెడ్డి, కిసాన్‌ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ అధికారికంగా ప్రకటించింది.

ఇదీ చూడండి:పాల్వాయి హరీశ్ బాబు అరెస్టు అప్రజాస్వామికం: బండి సంజయ్

ABOUT THE AUTHOR

...view details