ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం బియ్యం బంజర ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి సర్పంచ్ భూక్య పంతులు, ఎంపీటీసీ సభ్యురాలు వంగా ఝాన్సీలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పరీక్షల్లో చదివిన అంశాలు వస్తాయనే విశ్వాసంతో అడుగులు వేస్తే విజయం తధ్యమని యుటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బండి నరసింహా అన్నారు.
'ప్రతి ఒక్కరికి సమయం సమానమే' - khammam latest news today
పరీక్షలంటే అనవసర భయాలు వద్దని, ప్రణాళికా బద్ధంగా చదివితే విజయం సాధ్యమని బియ్యం బంజర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి. శ్రీనివాసరావు పేర్కొన్నారు. 10వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు కార్యక్రమం సందర్భంగా ఆయన ప్రసంగించారు.
'ప్రతి ఒక్కరికి సమయం సమానమే'
సమయం, అవకాశాలు అనేవి ప్రపంచంలో ప్రతి ఒక్కరికి సమానమేనని పాఠశాల పూర్వ విద్యార్థి భాస్కర్ పేర్కొన్నారు. వాటిని వినియోగించుకునే విధానంలోనే నేర్పరితనం ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. అదే గ్రామంలోని అరుణోదయ పాఠశాలలో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిపారు.
ఇదీ చూడండి :కరోనా భయంతో డీమార్ట్‌లో పరీక్షలు!