ఖమ్మం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీవీ నరసింహరావు శతజయంతి ఉత్సవాలు నిర్వహించారు. సామాన్యుడు, ఎటువంటి రాజకీయ నేపథ్యం లేని కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ప్రధానిగా ఎదిగిన ఘనత పీవీ నరసింహరావుకే చెందుతుందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
సామాన్యుడు మహనీయుడయ్యాడు : భట్టి విక్రమార్క - పీవీ నరసింహరావు జయంతి
సామాన్య కుటుంబంలో పుట్టి.. మహనీయుడైన వ్యక్తి పీవీ నరసింహరావు అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ప్రధాని పీవీ నరసింహరావు శతజయంతి ఉత్సవాలు నిర్వహించారు.
సామాన్యుడు మహనీయుడయ్యాడు : భట్టి విక్రమార్క
పీవీ లేని లోటు కాంగ్రెస్ పార్టీకీ ఎప్పటికీ తీరని లోటే అని భట్టి అన్నారు. తెలంగాణలో పుట్టి భూసంస్కరణలు చేసి.. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టిన ఘనుడు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పువ్వుల దుర్గాప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్ రావు, ఖమ్మం కార్పొరేటర్లు పాల్గొన్నారు.