తెలంగాణ

telangana

ETV Bharat / state

Bhatti vikramarka: పెరిగిన నిత్యావసరాల ధరలను తగ్గించాలని భట్టి పాదయాత్ర - congress

Bhatti vikramarka padayatra: కేంద్రంలోని భాజపా పాలనలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు విపరీతంగా పెరగటం వల్ల ఉప్పు, పప్పు వంటి అన్ని నిత్యావసర ధరలు ఆకాశాన్నంటాయని భట్టి విక్రమార్క ఆరోపించారు. ఆమేథిలో రాహుల్‌ గాంధీ చేపట్టిన పాదయాత్రకు సంఘీభావంగా ఖమ్మంలో పాదయాత్ర నిర్వహించారు.

Bhatti vikramarka: పెరిగిన నిత్యావసరాల ధరలను తగ్గించాలని భట్టి విక్రమార్క పాదయాత్ర
Bhatti vikramarka: పెరిగిన నిత్యావసరాల ధరలను తగ్గించాలని భట్టి విక్రమార్క పాదయాత్ర

By

Published : Dec 18, 2021, 3:42 PM IST

Bhatti vikramarka: పెరిగిన నిత్యావసరాల ధరలను తగ్గించాలని భట్టి విక్రమార్క పాదయాత్ర

Bhatti vikramarka padayatra: పెరిగిన ధరలను అదుపు చేయాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఆమేథిలో రాహుల్‌ గాంధీ చేపట్టిన పాదయాత్రకు సంఘీభావంగా ఖమ్మంలో పాదయాత్ర నిర్వహించారు. భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో నిర్వహించిన పాదయాత్ర కాల్వొడ్డు నుంచి జడ్పీ కూడలిలోని అంబేడ్కర్‌ విగ్రహం వరకు సాగింది. భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

కేంద్రంలోని భాజపా పాలనలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు విపరీతంగా పెరగటం వల్ల ఉప్పు, పప్పు వంటి అన్ని నిత్యావసర ధరలు ఆకాశాన్నంటాయని భట్టి విక్రమార్క విమర్శించారు. ధరలను నియంత్రించక పోతే ప్రజల నుంచి పాలకులు తిరుగుబాటు ఎదుర్కొనక తప్పదన్నారు.

ఆ బాధ్యత ప్రభుత్వాలదే..

'పెంచిన పెట్రోల్​, డీజిల్​ ధరలకు వ్యతిరేకంగా, అలాగే దేశంలో పెరిగిన నిత్యావసర ధరలకు వ్యతిరేకంగా ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్​ గాంధీ ఆమేథిలో పాదయాత్ర చేస్తున్నారు. ఆయనకు సంఘీభావంగా పాదయాత్ర చేపట్టాం. ప్రభుత్వం పెట్రోల్​, డీజిల్​పై వేసిన పన్నులను తగ్గించాలి. నిత్యావసర వస్తువులపై ధరలను తగ్గించాలి. గ్యాస్​ ధరలను తగ్గించాలి. నిత్యావసరాల ధరలు ప్రజలకు అందుబాటులోకి వచ్చేలా ఉండాలని కాంగ్రెస్​ పక్షాన దేశవ్యాప్తంగా పాదయాత్రలు చేపట్టాం. ప్రజలను దోపిడీ చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై చాలా బాధ్యత ఉంది.'

-భట్టి విక్రమార్క, సీఎల్పీ నేత

ఇదీ చదవండి:

Family suicide attempt at Pragati Bhavan : ప్రగతి భవన్ వద్ద కుటుంబం ఆత్మహత్యాయత్నం

ABOUT THE AUTHOR

...view details