రైతులకు నష్టం కలిగించే సాగు చట్టాలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తలపెట్టిన భారత్ బంద్ ఖమ్మం జిల్లా మధిరలో ప్రశాంతంగా కొనసాగుతోంది. డిపో నుంచి బస్సులు బయటకు రాకుండా అఖిలపక్ష నాయకులు అడ్డుకున్నారు.
మధిరలో ప్రశాంతంగా భారత్ బంద్ - madhira latest news
ఖమ్మం జిల్లా మధిరలో భారత్ బంద్ కొనసాగుతోంది. డిపో నుంచి బస్సులు బయటకు రాకుండా అఖిలపక్ష నాయకులు అడ్డుకున్నారు. పట్టణంలోని వ్యాపార వాణిజ్య సముదాయాలు, దుకాణాలు మూసివేయించారు.
![మధిరలో ప్రశాంతంగా భారత్ బంద్ Bharat Bandh in Madhira](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11163268-505-11163268-1616734440749.jpg)
Bharat Bandh in Madhira
అనంతరం నాయకులంతా ప్రదర్శనగా సుందరయ్యనగర్ కూడలి వద్దకు చేరుకొని... కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పట్టణంలోని వ్యాపార వాణిజ్య సముదాయాలు, దుకాణాలు మూసివేయించారు. ఆటోలు కూడా తిరగకుండా నిలిపివేశారు.