తెలంగాణ

telangana

ETV Bharat / state

'వ్యాపార సంఘాలు భారత్ బంద్​కు సహకరించాలి' - తెలంగాణ వార్తలు

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఖమ్మంలో భారత్ బంద్ కొనసాగుతోంది. ప్రతిపక్షాల ఆధ్వర్యంలో తెల్లవారుజామున బస్ డిపో ఎదుట ధర్నా నిర్వహించారు. వ్యాపార సంఘాలు బంద్​కు సహకరించాలని కోరారు.

Bharat Bandh in khammam district
ఖమ్మంలో ప్రశాంతంగా కొనసాగుతోన్న భారత్ బంద్

By

Published : Mar 26, 2021, 10:21 AM IST

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న భారత్ బంద్ ఖమ్మంలో ప్రశాంతంగా సాగుతోంది. ప్రతిపక్షాల నేతలు తెల్లవారుజామున బస్ డిపో ఎదుట ధర్నా నిర్వహించారు. దిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళనను కేంద్రం పట్టించుకోవటం లేదని వాపోయారు.

పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకు పెరుగుతుండటంతో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని తెలిపారు. వాటిని అరికట్టే దిశగా కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. ప్రతి ఒక్కరు బంద్​లో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

ఇదీ చదవండి:బంగ్లాదేశ్​ పర్యటనకు బయలుదేరిన మోదీ

ABOUT THE AUTHOR

...view details