ఖమ్మం జిల్లాలో భారత్ బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ దిల్లీలో రైతులు చేస్తున్న పోరాటానికి ప్రతి ఒక్కరు మద్దతివ్వాలని జిల్లా వామపక్ష, కాంగ్రెస్ నేతలు కోరారు. రహదారులపైకి వచ్చిన వాహనదారులను తిరిగి పంపిస్తూ బంద్కు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
భారత్ బంద్: రోడ్లపైకి వచ్చిన వాహనాల్లో గాలి తీస్తున్న నాయకులు - khammam district support to bharat bandh
దిల్లీలో రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా నిర్వహిస్తున్న భారత్ బంద్ ఖమ్మం జిల్లాలో ప్రశాంతంగా జరుగుతోంది. రహదారులపైకి వచ్చిన వాహనదారులను వామపక్ష, కాంగ్రెస్ కార్యకర్తలు తిరిగి పంపిస్తున్నారు. బంద్కు సహకరించి రైతులకు మద్దతుగా నిలవాలని కోరుతున్నారు.
ఖమ్మం జిల్లాలో భారత్ బంద్
ఖమ్మం నగరంలో దుకాణాలన్నీ మూసివేయడం వల్ల రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. కేంద్రం వెంటనే రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని వామపక్ష, కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు.
- ఇదీ చూడండి :రాజధానికి అన్నివైపులా ఐటీ పరిశ్రమల విస్తరణ