నేలకొండపల్లిలో భక్తరామదాసు ఉత్సవాలు - jayanthi
భక్త రామదాసు 368 జయంతి ఉత్సవాలు నేలకొండపల్లిలో ఘనంగా నిర్వహించారు. రామదాసు కీర్తనలు, నాటకాలు ఆకట్టుకున్నాయి.
భక్త రామదాసు ఉత్సవాలు
ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో భక్త రామదాసు 368వ జయంతి ఉత్సవాలను ధ్యాన మందిరంలో ఘనంగా నిర్వహించారు. మూడు రోజుల పాటు జరిగిన ఉత్సవాల్లో చివరి రోజు సంగీత, నాటక నృత్య పోటీలను నిర్వహించారు. రాష్ట్రం నలుమూలల నుంచి కళాకారులు రామదాసు కీర్తనలు ఆలపించారు. నాట్య మండలి విద్యార్థులు ప్రదర్శించిన నాటకాలు, నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఉత్సవాలను తిలకించడానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.