తెలంగాణ

telangana

ETV Bharat / state

Bhadrachalam Ex MLA Kunja Satyavathi Passed Away : భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కుంజా సత్యవతి కన్నుమూత

Bhadrachalam Ex MLA Kunja Satyavathi Passed Away : భద్రాచలం మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకురాలు కుంజా సత్యవతి ఆకస్మాత్తుగా మరణించారు. ఆదివారం రోజున ఆమె అస్వస్థతకు గురవడంతో భద్రాచలంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. సత్యవతి మృతిపై బీజేపీ నాయకులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

By ETV Bharat Telangana Team

Published : Oct 16, 2023, 9:34 AM IST

Ex MLA Kunja Satyavathi Passed Away
Bhadrachalam Ex MLA Kunja Satyavathi Passed Away

Bhadrachalam Ex MLA Kunja Satyavathi Passed Away : భద్రాచలం మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకురాలు కుంజా సత్యవతి తెల్లవారు జామున గుండె నొప్పి(Kunja Satyavathi Died of Heart Attack)తో మరణించారు. ఆదివారం ఆమె అస్వస్థతకు గురవడంతో హుటాహుటిన భద్రాచలంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఇవాళ తెల్లవారుజామున ఆమె తుది శ్వాస విడిచారు. సత్యవతి మృతితో కుటుంబ సభ్యులు, అభిమానులు కన్నీటి పర్యంతమయ్యారు.

ప్రస్తుతం సత్యవతి బీజేపీలో చురుకుగా పని చేస్తున్నారు. కుంజా సత్యవతి మృతి చెందడం పార్టీకి తీరని లోటు అని బీజేపీ నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బీజేపీ నాయకులతో పాటు భద్రాచలంలోని ఇతర పార్టీలకు చెందిన నాయకులు, ప్రముఖులు ఆమె ఆకస్మిక మృతిపట్ల విచారం వ్యక్తం చేస్తున్నారు. స్థానికులు, అభిమానుల సందర్శనార్థం భద్రాచలంలోని ఆమె స్వగృహంలో పార్థివ దేహాన్ని ఉంచారు. భద్రాచలానికి చెందిన కుంజా సత్యవతి కాంగ్రెస్​ నుంచి పోటీ చేసి 2009 నుంచి 2014 వరకు భద్రాచలం నియోజకవర్గం శాసన సభ్యురాలుగా పనిచేశారు. అనంతరం జరిగిన పరిణామాల దృష్ట్యా బీజేపీలో చేరి.. పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు.

Gaddar Passed Away : మూగబోయిన ఉద్యమగళం.. ప్రముఖ ప్రజాగాయకుడు గద్దర్ కన్నుమూత..

కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి సంతాపం : మాజీ ఎమ్మెల్యే, బీజేపీ మహిళా నేత కుంజా సత్యవతి ఆకస్మిక మరణం పట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆమెతో పని చేసిన రోజులను గుర్తు చేసుకుని.. సంతాప సందేశాన్ని అందించారు. 2009-14లో అసెంబ్లీలో ఆమెతో పని చేశానని తెలిపారు. గిరిజనుల అభివృద్ధి కోసం ఎప్పుడూ తపనపడేవారని.. ఏ చిన్న అవకాశం వచ్చిన ప్రజా సంక్షేమం విషయంలో తన గొంతుకని బలంగా వినిపించేవారని గుర్తు చేసుకున్నారు. ములుగులో గిరిజన సెంట్రల్​ యూనివర్సిటీని మోదీ ప్రకటించిన సందర్భంలో.. వారం రోజుల ముందు మేడారంలో అమ్మవారిని దర్శించుకుని తామందరి తరఫున మోదీకి ధన్యవాదాలు చెప్పే కార్యక్రమం ఏర్పాటు చేశామని చెప్పారు. ఆ కార్యక్రమంలో కుంజా సత్యవతితో మాట్లాడినట్లు చెప్పారు.

Etela Rajender Mourns Death of Kunja Satyavathi :ఎన్నికల కోసం క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనితీరును సత్యవతి ఎంతో స్పష్టంగా తమకు వివరించారని కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి గుర్తు చేసుకున్నారు. ఇంతలో ఇలాంటి దిగ్భ్రాంతికరమైన వార్తను వినాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తూ.. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మరోవైపు హుజూరాబాద్​ ఎమ్మెల్యే ఈటల రాజేందర్​ కూడా ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఆమె స్వగృహం వద్దకు వెళ్లి కుంజా సత్యవతి పార్దేవదేహానికి భద్రాచలం ఎమ్మెల్యే పోదెం వీరయ్య నివాళులు అర్పించారు.

30 ఏళ్ల వయసులోనే గుండె నొప్పి.. కారణం ఇదేనా?

హైదరాబాద్​ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఎమ్మెల్యే మృతి

ABOUT THE AUTHOR

...view details