దేశంలోనే మొదటి సారిగా భూ రికార్డుల ప్రక్షాళన చేసి 57 లక్షల మంది రైతులకు పాసు పుస్తకాలు ఇచ్చిన ఘనత తెరాస ప్రభుత్వానిదేనని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. ఖమ్మం జిల్లా పరిషత్ సమావేశాల్లో మంత్రి పాల్గొన్నారు. రైతుబంధు ఇచ్చేందుకు చేసిన భూ రికార్డుల ప్రక్షాళనలో రెవెన్యూ అధికారులు అనేక అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. వారి బారినుంచి రైతులను కాపాడేందుకు వీఆర్వో వ్యవస్థను సీఎం కేసీఆర్ రద్దు చేసి కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చారని పేర్కొన్నారు.
కొత్త రెవెన్యూ చట్టంతో పేదలు, రైతులకు మేలు: పువ్వాడ - ఖమ్మం జడ్పీ మీటింగ్‌లో పాల్గొన్న పువ్వాడ అజయ్ కుమార్
అవినీతి నుంచి రైతులను కాపాడేందుకే వీఆర్వో వ్యవస్థను సీఎం కేసీఆర్ రద్దు చేసినట్లు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. త్వరలోనే సమగ్ర భూ సర్వే చేస్తామని తెలిపారు. కొత్త రెవెన్యూ చట్టం ద్వారా పేదలు, సన్నకారు రైతులకు మేలు జరిగిందన్నారు.
puvvada ajay kumar
ఈ చట్టం దేశానికే ఆదర్శంగా నిలిచిందని మంత్రి అన్నారు. త్వరలోనే రాష్ట్రంలో సమగ్ర భూ సర్వే చేయనున్నట్లు స్పష్టం చేశారు. కొత్త చట్టం ద్వారా పేదలు, సన్నకారు రైతులకు మేలు జరిగిందన్నారు. రెవెన్యూ బిల్లు పెట్టే సమయంలో తాను సభలో ఉండటం గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు.
ఇదీ చదవండి:మంత్రి హరీశ్‌రావుకు కరోనా నెగెటివ్