ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో సహకార ఎన్నికలకు ఓటర్లు తమ ఓటు హక్కును ప్రశాంతంగా వినియోగించుకున్నారు. నాలుగు మండలాల్లో 16 సహకార సంఘాలు ఉండగా, ఎనిమిది సహకార సంఘాలు ఏకగ్రీవం అయ్యాయి. మిగతా సహకార సంఘాలకు ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది.
పాలేరు నియోజకవర్గంలో నాలుగు మండలాల్లో పోలింగ్ ప్రారంభం - khammam district news today
పాలేరు నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో సహకార ఎన్నికలకు ఉదయం ఏడు గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. ఓటు వేసేందుకు ఓటర్లు ఉదయం నుంచే వస్తున్నారు.
పాలేరు నియోజకవర్గంలో నాలుగు మండలాల్లో పోలింగ్ ప్రారంభం
ఉదయం ఏడు గంటలకే ఓటింగ్ ప్రారంభమైంది. పోలింగ్ కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గస్తీ కాస్తున్నారు.
ఇదీ చూడండి :రాజకీయ హత్య: సహకార ఎన్నికల వేళ రక్తం చిందించిన యర్కారం