ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం బీరోలు సహకార సంఘం ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికలు పోలీసు బందోబస్తుతో నిర్వహించారు. 13 వార్డులకు గానూ... అన్నింటినీ తెరాస మద్దతుదారులు గెలుచుకున్నారు. పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి వర్గం 4 వార్డులు, తెరాస జిల్లా నాయకుడు రామరెడ్డి వర్గం 9 వార్డులు దక్కించుకున్నారు.
బీరోలు సహకార ఎన్నికలు ముగిశాయి - beerolu coperative socitey chairmen election
ఖమ్మం జిల్లా బీరోలు సహకార సంఘం ఛైర్మన్, వైస్ ఛైర్మన్గా రామసహాయం నరేష్ రెడ్డి, రమేశ్ ఎన్నికయ్యారు. అన్ని స్థానాలు తెరాస గెలిచినప్పటికీ... రెండు వర్గాలుగా విడిపోవడం వల్ల ఎన్నిక నేటికి వాయిదా పడింది.
![బీరోలు సహకార ఎన్నికలు ముగిశాయి beerolu coperative socitey chairmen election complete](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6108591-thumbnail-3x2-beerolu.jpg)
ముగిసిన బీరోలు సహకార సంఘం ఛైర్మన్ ఎన్నిక
ఛైర్మన్, వైస్ ఛైర్మన్ విషయంలో రెండు వర్గాల మధ్య వివాదంతో... ఆదివారం జరగాల్సిన ఎన్నిక నేటికి వాయిదా పడింది. స్వల్ప ఉద్రిక్తత మధ్య నిర్వహించిన ఎన్నికలో... రామస్వామి నరేష్ రెడ్డి ఛైర్మన్గా, రమేశ్ వైస్ ఛైర్మన్గా ఎన్నికయ్యారు. నిజమైన తెరాస పార్టీ గెలిచిందని, కేసీఆర్ పుట్టినరోజు బహుమతిగా ఇస్తామని ఛైర్మన్ రామస్వామి నరేష్ రెడ్డి అన్నారు.
ముగిసిన బీరోలు సహకార సంఘం ఛైర్మన్ ఎన్నిక