మహాత్మా గాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని ఖమ్మం జిల్లా తల్లాడలో 150 బతుకమ్మలతో విద్యార్థులు నివాళి అర్పించారు. తమ ఇళ్ల వద్ద నుంచి బతకమ్మలు తెచ్చి తెలంగాణ, భారతదేశం ఆకారంలో ఉన్న పటాల మధ్యలో ఉంచి బతుకమ్మ ఆడి పాడారు. గాంధీ విగ్రహం ఎదుట బతకమ్మ ఆడుతూ బాపూజీకి వినూత్నంగా నివాళి అర్పించారు. ఉత్సవాల అనంతరం అతిథులు, విద్యార్థులు, గ్రామ పెద్దలు, గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేశారు. వేడుకల్లో కేఎస్‌ఎం కళాశాల, బాల భారతి విద్యాలయం విద్యార్థులు పాల్గొన్నారు.
'150 బతుకమ్మలతో గాంధీజీకి నివాళి ' - bathukamma celebrates
ఖమ్మం జిల్లాలో మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా 150 బతుకమ్మలతో విద్యార్థినిలు సంబురాలు నిర్వహించారు.

'150 బతుకమ్మలతో గాంధీజీకి నివాళి '