తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ ఖమ్మం బ్యాంకు ఉద్యోగులు ధర్నా చౌక్ వద్ద ఆందోళన చేపట్టారు. వేతన సవరణ, పనిదినాల కుదింపు, మూల వేతనంలో ప్రత్యేక భత్యం విలీనం అంశాలు వెంటనే అమలు చేయాలని నినాదాలు చేశారు. ఐబీఏ తన మొండి వైఖరిని వీడాలని ప్లకార్డులు ప్రదర్శించారు.
ఐబీఏ తన మొండి వైఖరిని వీడాలి: బ్యాంకు ఉద్యోగులు
బ్యాంకు వ్యవస్థలు దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అని చెప్పిన ప్రభుత్వం.. బ్యాంకు ఉద్యోగులకు సరైన వేతనాలు ఎందుకు ఇవ్వట్లేదని ఖమ్మంలో ఉద్యోగులు ప్రశ్నించారు. ఐబీఏ తన మొండి వైఖరిని వీడాలని నిరసన చేపట్టారు.
ఐబీఏ తన మొండి వైఖరిని వీడాలి: బ్యాంకు ఉద్యోగులు
బ్యాంకు వ్యవస్థలు దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అని తెలిపిన ప్రభుత్వం..తమకు సరైన వేతనాలు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. భారతీయ బ్యాంకుల సంఘం తీసుకునే నిర్ణయాలే తాము సమ్మె చేయడానికి ప్రధాన కారణమన్నారు. తమ డిమాండ్లను పరిష్కరించేంతవరకూ సమ్మెను కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
ఇవీ చూడండి:రాయితీల కోసం.. బయో మోసం..