Bandi Sanjay fires on KCR in Khammam BJP meeting : ఖమ్మం ప్రజలకు భరోసా ఇచ్చేందుకు ఈనెల 15వ తేదీన కేంద్ర మంత్రి అమిత్ షాతో బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించారు. ఖమ్మం జిల్లాలో బీజేపీ 'జన సంపర్క్ అభియాన్' కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన బండి.. ఖమ్మం ప్రజలపై బీజేపీ రాష్ట్ర, జాతీయ నాయకత్వానికి బాగా నమ్మకం ఉన్నట్లు తెలిపారు. జిల్లాలో కమలం తప్పకుండా వికసిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
ఖమ్మంలో బీజేపీ లేదని కొందరు అవమానిస్తున్నారని పేర్కొన్న ఆయన.. జిల్లాలో పార్టీ బలమేంటో కార్యకర్తలు చూపాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బండి సంజయ్ పలు విమర్శలు చేశారు. అప్పుల రాష్ట్రం అభివృద్ధి రాష్ట్రంగా మారాలని కోరుకుంటున్నట్లు ఆరోపించారు. ఖమ్మం జిల్లాలో డబుల్ బెడ్ రూం ఇళ్లు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. పోలీస్ సిబ్బందికి సైతం వారికి రావాల్సిన అలవెన్స్‌లు ఇవ్వడం లేదని ఆరోపించారు. ఇవాళ జన సంపర్క్ అభియాన్ కార్యక్రమం ద్వారా మోదీ తొమ్మిదేళ్ల పాలను చేసిన అభివృద్ధిని వివరిస్తున్నట్లు గుర్తు చేశారు.
BJP Jana Sampark campaign in Khammam : ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 199 నియోజక వర్గాలలో బహిరంగ సభలో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈనెల 15వ తేదీన ఖమ్మం జిల్లాలో బీజేపీ బహిరంగ సభలో కేంద్ర మంత్రి అమిత్ షా రానున్నట్లు ప్రకటించారు. ఆ తరువాత 20వ తేదీన నాగర్ కర్నూల్లో జరిగే మీటింగ్‌కు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వస్తారని తెలిపారు. అంతే కాకుండా త్వరలోనే ప్రధాని మోదీని సైతం ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఖమ్మంలో బీజేపీ చేసిన అభివృద్ది పనులు, ఉద్యమాలను గుర్తు చేసుకున్నారు.
ఈనెల 15న కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఖమ్మం వస్తున్నారు. లక్ష మందికి తగ్గకుండా జనసమీకరణ చేసి బహిరంగ సభను విజయవంతం చేసి చూపిస్తాం. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలతోపాటు సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల నుంచి కార్యకర్తలను భారీగా తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. ఖమ్మంలో బీజేపీ సత్తా చూపేందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. దేశం కోసం, దేశ రక్షణ కోసం శ్రమిస్తున్న హోంమంత్రి అమిత్‌షాను ఉమ్మడి జిల్లా ప్రజలు ఆశీర్వదించాలి. రాష్ట్రంలో కాంగ్రెస్ పని అయిపోయింది. జాకీ పెట్టి లేపినా కాంగ్రెస్ లేచే పరిస్థితిలో లేదు. కమ్యూనిస్టు పార్టీలు కాలగర్భంలో కలిసిపోయారు. బీజేపీ గ్రాఫ్‌ను దెబ్బతీసేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్ పని చేస్తున్నాయి.- బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
'ఖమ్మంలో కమలం తప్పకుండా వికసిస్తుంది' ఇవీ చదవండి: