తెలంగాణ

telangana

ETV Bharat / state

ఖమ్మంలో పర్యటించనున్న బండి సంజయ్, తరుణ్​చుగ్ - bjp leaders on mlc elections

ఖమ్మం కార్పొరేషన్, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు భాజపా సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఖమ్మంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, తరుణ్‌చుగ్ పర్యటించనున్నారు.

ఖమ్మంలో బండి సంజయ్, తరుణ్​చుగ్ పర్యటన
ఖమ్మంలో బండి సంజయ్, తరుణ్​చుగ్ పర్యటన

By

Published : Jan 8, 2021, 12:23 PM IST

ఖమ్మం కార్పొరేషన్, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు భాజపా సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఖమ్మంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, తరుణ్‌చుగ్ పర్యటించనున్నారు. ఎన్నికలపై శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. వరంగల్ క్రాస్ రోడ్ వద్ద ఘనస్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణుల ఏర్పాట్లు చేశారు.

క్రాస్ రోడ్ నుంచి ఖమ్మం పార్టీ కార్యాలయం వరకు రోడ్‌షో నిర్వహించనున్నారు. అనంతరం నాయకులు, కార్యకర్తలతో సంజయ్, తరుణ్‌చుగ్ సమావేశంకానున్నారు. సంజయ్, తరుణ్‌చుగ్ సమక్షంలో పలువురు నాయకులు భాజపాలో చేరనున్నారు. ప్రముఖులు, మేధావులతో వీరు సమావేశంకానున్నారు. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని బూత్ కమిటీల ప్రతినిధులు, ఖమ్మం, భద్రాద్రి జిల్లాల పార్టీ ఆఫీస్ బేరర్లతో భేటీకానున్నారు.

ఇదీ చూడండి:పీహెచ్‌సీల్లోనూ కరోనా టీకా నమోదుకు అవకాశం

ABOUT THE AUTHOR

...view details